Tamannaah : మరో ఐటమ్ సాంగ్‌తో తమన్నా
Tamannaah : తెలుగు చిత్రసీమలో అగ్రకథానాయికలు ప్రత్యేక గీతాల్లో నటించే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది మిల్కీబ్యూటీ తమన్నా.
‘అల్లుడు శీను’, ‘జై లవకుశ’తో పాటు పలు తెలుగు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నది.
తాజాగా ‘గని’ సినిమాలోని ఐటెంసాంగ్‌లో తమన్నా హుషారైన నృత్యాలతో మెప్పించింది.
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు.
అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు.
ఈ చిత్రంలో తమన్నా నటించిన ఐటెంసాంగ్ ‘కొడితే’ అనే పాటను ఇటీవల విడుదలచేశారు.
రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. హారిక నారాయణ్ ఆలపించారు.
తమన్ స్వరకర్త. యూట్యూబ్‌లో ఈ గీతానికి రెండున్నరమిలియన్లకుపైగా వ్యూస్ లభించాయి.
ఈ పాటకు తమన్నా నృత్యాలు, గ్లామర్ ప్రధానాకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది.
బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నది.
సయీ మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్‌శెట్టి, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.