Tamannah : అందుకే హిందీలో కలిసిరాలేదు
Tamannah : దక్షిణాది చిత్రపరిశ్రమ (South Film Industry)లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్లలో ఒకరు తమన్నా (Tamannah).
ఈ మిల్కీ బ్యూటీ హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చినా ప్రస్తుతం మాత్రం ఎక్కువగా సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది.
ఈ భామ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ కేన్స్ (South Film Industry)కు తొలిసారి హాజరై సందడి చేసింది.
దక్షిణాదితో పోలిస్తే హిందీలో కెరీర్ అంతగా క్లిక్ కాలేదన్న ప్రశ్నకు తమన్నా స్పందించింది.
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గన్‌తో హిమ్మత్ వాలా (Himmatwala) సినిమా చేసినపుడు ఆ ప్రాజెక్టు హాట్ కేక్‌లా ఉండేది.
కానీ విడుదలయ్యాక ఆ చిత్రం ప్లాప్‌గా నిలిచింది. హిందీ (Bollywood) నుంచి మంచి ఆఫర్లు రావడం లేదు.
చేసిన తప్పుల నుంచి తాను గుణపాఠం నేర్చుకున్నానని, ఇపుడు చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేస్తున్నానని చెప్పింది తమన్నా.
బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయని, దక్షిణాది సినిమాలపై ఎలాంటి కంప్లెయింట్స్ లేవని చెప్పుకొచ్చింది తమన్నా.
తమన్నా ప్రస్తుతం తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా సీతాకాలం సినిమాలు చేస్తోంది.
హిందీలో బోలే చుడియాన్, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ చిత్రాల్లో నటిస్తుండగా..షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో కీ రోల్ పోషిస్తోంది.
ఇటీవలే వరుణ్ తేజ్ నటించిన గని సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది మిల్కీ బ్యూటీ.