There are rumors that he has dropped out of the project. Kajal may have missed out for some reason. Tapsi (tapsee) is said ok in her place.
గత 13 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకంగా అభిమానగణాన్ని సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్.
తెలుగులోనే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోలందరి సరసన ఆమె నటించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
ఇటీవల వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్.. తన భర్తతో కలిసి కుషన్ బిజినెస్‌ను కూడా మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే, కాజల్ అగర్వాల్ తాజాగా ఒక సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం. తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో నటించడానికి కాజల్ అంగీకరించిన విషయం తెలిసిందే.
కానీ, ఇప్పుడు కాజల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల కాజల్ తప్పుకున్నారట.
ఆమె స్థానంలో తాప్సీ పన్నును తేజ తీసుకున్నారని అంటున్నారు.