వికసిత్ భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశ పెట్టనుంది. ఈ సారి కూడా ‘పేపర్ లెస్’ బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ట్యాబ్లో బడ్జెట్ను ఆమె తీసుకొచ్చారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశమై.. బడ్జెట్ను ఆమోదించనుంది.