Homeవిద్య & ఉద్యోగంతెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

03-01-2014

తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు ఈ ప్రత్యేకంగా సమావేశమైన శాసన సభ మూడు వాయిదాలతో 15 నిముషాలు మాత్రమే కొనసాగి మరునాటికి వాయిదా పదింది.

07-01-2014

తెలంగాణ జేయేసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దిక్ష నిర్వహించారు.

తెలంగాణ బిల్లులో చేపట్టాల్సిన 13 సవరణలను ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఆమోదించారు.

08-01-2014

రాష్ట్ర విభజన బిల్లుపై ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం స్పీకర్‌ ఆదేశాల మేరకు మంత్రి వట్టి వసంతకుమార్‌ చర్చను ప్రారంభించారు.

09-01-2014

ఆంధ్ర ప్రదేశ్‌ శాసన సభ, శాసన మండలిలో తెలంగాణ బిల్లుపై వాడివేడి చర్చ కొనసాగింది.

25-01-2014

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును తిరస్కరిస్తూనే, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టెందుకు సిఫారసు చేయవద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసే తీర్మాణాన్ని శాసన సభలో తేవడానికి వీలుగా స్వీకర్‌, మండలి చైర్మన్‌లకు ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డికి నోటీసులిచ్చారు.

30-01-2014

తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చేపట్టిన చర్చ ఈ రోజుతో ముగిసింది. సభలో తీవ గందరగోళం కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి కిరణకుమార్‌ రెడ్డి ప్రవెశపెట్టిన తీర్మాణాన్ని మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు శాసన సభ స్వీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ప్రకటించారు.

03-02-2014

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇరు
ప్రాంతాలకు “సమన్యాయం” చేయాలని డిమాండ్‌ చేసారు

04-02-2014

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు ఢిల్లీలో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి బిల్లులో చేపట్టవలసిన సవరణలపై చర్చించారు.
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జేయేసీ స్టీరింగ్‌ కమిటి అత్యవసర సమావెశం జరిగింది.

05-02-2014

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్రపతి కలిసి కోరిన ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.
విభజనను ఆపాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్దిని కలిసిన వైకాపా అధినేత వై.యస్‌. జగన్‌ మరియు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.

ప్రధాని మన్నోహన్‌ను వేర్వేరుగా కలిసిన తెలంగాణకు చెందిన మంత్రులు, కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యే, ఎంపీలు.
ముంబాయిలో శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరెను కలిసి విభజను ఆపాలని కోరిన చంద్రబాబు.

06-02-2014

తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన జీవోయం. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు
వాయిదా.


పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి.
సమన్వాయం చేయాలని చెన్నైలో జయలలిత, కరుణానిధిలను కలిసిన చంద్రబాబు.

07-02-2014

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌విభజన బిల్లుకు వ్యతిరేకంగా వేసిన తొమ్మిడి ఫిటీషన్లను సుప్రింకోర్టు తిరస్కరించింది.


రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర మంత్రి వర్షం ఆమోదించింది. బిల్లులో ప్రభుత్వ పరంగా 32 సవరణలను తీసుక రావాలని కేబినెట్‌ నిర్ణయించింది.
టిఆర్‌ఎస్‌ పార్టి తరుపున తొలి రాజ్యసభ సభ్యునిగా కేశవరావు ఎన్నికైనారు.

10-02-2014

తెలంగాణ, సమైకాంధ్ర నినాదాలతో ఉభయ సభలు మళ్లీ వాయిదా. కోల్‌కత్తాలో మమతాబెనర్జిని కలిసి విభజన ఆపాలని కోరిన టిడిపి అధినేత చంద్రబాబు.

సీమాంధ్రకు చెందిన ఆరుగురు పార్లమెంటు సభ్యులను పార్టీనుండి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టి అధిష్టానం ప్రకటించింది.

తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా వుందని బిజెపి అగ్రనేత ఎల్‌కే అధ్వాని అభ్యంతరం. వామపక్షనేతలు ప్రకాశ్‌ కారత్‌, ఎబి బర్ధన్‌లను కలిసి విభజన ఆపాలని కోరిన చంద్రబాబు

12-02-2014

లోక్‌సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ సభ వాయిదా.

13-02-2014

మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో సభా వ్యవహారాల జాబితాలోని 20-ఎ అంశం అయిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థకరణ బిల్లును ప్రవెశపెట్టిన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ శిందే.


లోక్‌సభలో పెప్పర్ స్ప్రే చల్లిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌.

16-02-2014

నరెంద్రమోడి, ములాయంసింగ్‌ యాదవ్‌, శరద్‌యాదవ్‌లను వేర్వేరుగా కలిసి విభజనను అడ్డుకోవాలని కోరిన టిడిపి అధినేత చంద్రబాబు.

17-02-2014

ఢిల్లీలో సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో వైయస్‌ జగన్‌, ఎపిఎన్‌బిఓలు వేర్వేరుగా ధర్నా కార్యక్రమాలు.

18-02-2014

మధ్యాహ్నం 3 గంటలనుంచి 4.20 గంటల వరకు అధికార, ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతుతో 35 సవరణలతో కూడిన “ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్థిరణ బిల్లు-2014” కు లోక్‌సభ ఆమోదం.

19-02-2014

రాజ్యసభకు చేరిన “ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్టిరణ బిల్లు-2014” ఆంధ్ర ప్రదెశ్‌ ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్ది తన పదవికి, కాంగ్రెస్‌ పార్టికి రాజీనామా.

20-02-2014

రాజ్యసభలో “ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్టిరణ బిల్లు-2014” కు ఆమోదం.

21-02-2014

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ జేయేసీ నేతలు, కాంగ్రెస్‌ పార్టికి చెందిన తెలంగాణ నాయకులు.

26-02-2014

హైదరాబాద్‌కు చేరుకున్న టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌. “ఆంధ్ర ప్రదెశ్‌ పునర్‌వ్యవస్ట్థిరణ బిల్లు-2014” కేంద్ర న్యాయశాఖ తుది పరిశీలన తర్వాత హోంశాఖకు చేరింది.


28-02-2014

రాష్ట్రంలో రాష్ట్రపతి వాలనకు కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం.

01-03-2014

“ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్థిరణ బిల్లు-2014” కు రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్రంలో రాష్ట్రపతి వాలన ప్రారంభం, గవర్నర్‌ చెతికి పాలన భాద్యతలు.


తెలంగాణ జేయేసీ స్టిరింగ్‌ కమిటి సమావేశం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామి అవుతూ జేయేసీ తన పాత్రను కొనసాగిస్తుందని ప్రకటించిన కోదండరాం.


02-08-2014

చట్టంగా రూపొందిన “ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌వ్యవస్టిరణ బిల్లు- 2014. భద్రాచలం డివిజన్‌లోని ఏదు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్‌ తేవాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం, సుప్రింకోర్టును ఆశ్రయిస్తామన్న కేసిఆర్‌.

మరిన్ని..

తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 4

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ ఉద్యమం సంక్షిప్త సమాచారం – 8

Recent

- Advertisment -spot_img