Homeవిద్య & ఉద్యోగంTelangana Movement : తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

Telangana Movement : తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

కరీంనగర్‌ నుండి సిద్దిపేటలోని నిరాహార దీక్షాస్థలికి బయలుదేరిన కేసిఆర్‌ను అల్గునూరు దగ్గర పోలీసులు అరెస్ట్‌ చేసి ఖమ్మంకు తరలించారు.

కేసిఆర్‌ వెంట ఉన్న ప్రొ.. జయశంకర్‌ను అల్గునూరులో దించివేశారు.. కేసిఆర్‌ వాహనం వెంట డజన్ల కొద్ది పోలీస్‌ వాహనాలు కాన్వాయ్‌గా వెల్లినాయి.

ఆ రోజు ఆదివారం కావడంతో సెకండ్‌ క్లాస్​ స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ చదలవాడ శ్రీరామమూర్తి ఇంటికి కేసిఆర్‌ను, ఇతర నాయకులను హజరుపరిచారు.

అప్పుడే ఖమ్మం ఒకటవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో కైమ్‌ నెంబర్‌ 209/09 కింద కేసు నమోదైంది.

కేసిఆర్‌తో పాటు మరో పదిమందిపై 9 సెక్షన్ల కింద నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు.

అంతకు ముందు రోజు ఖమ్మం అంబేడ్కర్‌ సెంటర్​లో స్థానిక టిఆర్‌ఎన్‌ నాయకులు తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

ఆ ప్రదర్శన సందర్భంగా కార్యకర్తలు చేసిన నినాదాలు, వారి వెంట ఉన్న కరపత్రాలు, పోస్టర్లు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది పోలీసుల ఫిర్యాదు.

కొవ్వొత్తుల ప్రదర్శనలో కేసిఆర్‌ స్వయంగా పాల్గొనకపోయినా కుట్రదారుడిగా ఆయన పేరును చేర్చారు.

పోలీసులు కేసిఆర్‌ అరెస్ట్‌ సందర్భంగా ఈ కింది సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

  • 153(ఎ) ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం, సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం.
  • 505(2) ; వర్గాల మధ్య శత్రుత్వాన్ని , ద్వేషభావాన్ని రెచ్చగొట్టడం
  • 143 : అనుమతిలేని సభల్లో పాల్గొనడం.
  • 114 : నేరాలను ప్రేరేపించడం.
  • 117 : జనసముదాయాన్ని నేరానికి పురికొల్పడం
  • 120(బీ) : నేరం చేయడానికి కుట్ర పన్నడం.
  • 188 : ప్రభుత్వ ఉద్యోగుల ఆదేశాలను ధిక్కరించడం.
  • 506 : నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం.
  • సెక్షన్‌ 7 (క్రిమినల్‌ లా అమెండ్మెంట్​​‌ యాక్టు 1982) : ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారిని బెదిరించడం, హింసించడం.

పై సెక్షన్ల కింద కేసిఆర్‌తో పాటు మాజీ మంత్రులు కెప్టెన్‌ వడితల లక్ష్మీకాంతారావు, గుందె విజయరామరావు, నాయిని నర్సింహరెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు రాజయ్యయాదవ్‌, డోకుపర్తి సుబ్బారావు, జూపల్లి రాంజోగారావు, బత్తుల సోమయ్య, గోపగాని శంకర్‌రావు, మైనేని రాంబాబు, ఎండి అబ్దుల్‌నబీ లను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

మెజిస్ట్రేట్‌ శ్రీరామమూర్తి అడిగిన మాటలకు కేసిఆర్‌ స్పందిస్తూ “నన్ను వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు గానీ, హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలుకు గాని పంపండి” అని కోరారు.

“తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ఇక్కడి నుంచి తరలించడం సాధ్యం కాదు” అని ఏఎస్పీ పరిమళ మెజిస్ట్రేట్‌ కు వివరించారు.

లోపల విచారణ జరుగుతుండగా బయట వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

మెజిస్ట్రేట్‌ ఇంటి సమీపంలో న్యూడెమోక్రసీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు.

మరిన్ని..

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2011 ‌‌- 4

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

Recent

- Advertisment -spot_img