ఇదేనిజం, రేగొండ/వరంగల్ ప్రతినిధి: భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో కన్నతల్లిని గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. వివరాల ప్రకారం.. రాజి రెడ్డి(40) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి కొంచెం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమీపంలో మతిస్థిమితం కోల్పోయి కన్నతల్లిని రోకలితో బాది విచక్షణా రహితంగా చంపాడు. తల్లిని చంపే సమయంలో అడ్డుగా వచ్చిన మహిళపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కొన ఊపిరితో ఉన్న మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
నిందితుడు రాజు గ్రామంలో అందిరినీ చంపేస్తా అంటూ భయబ్రాంతులకు గురిచేస్తూ.. గ్రామం నుంచి పారిపోయాడు. తిరుమలగిరి పక్కన చిన్నకోడపాక గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అక్కడి గ్రామస్తులు రాజిరెడ్డిని దొంగగా భావించి పట్టుకొని తాళ్లతో కట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.