ఇదేనిజం, సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన ముగాచెవిటి కళాకారులు నాగరాజు, ఆగామప్ప అనే సోదరులు చేతితో గీసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటాన్ని గురువారం రేవంత్ రెడ్డి గృహంలో స్వయంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, పిసిసి సభ్యులు కె. శ్రీనివాస్ లు ఉన్నారు