Homeహైదరాబాద్latest Newsఉచిత గ్యాస్‌ సిలెండర్ల అమలుకు రంగం సిద్ధం.. దీపావళి నుంచి ఇంటింటా వెలుగు..!

ఉచిత గ్యాస్‌ సిలెండర్ల అమలుకు రంగం సిద్ధం.. దీపావళి నుంచి ఇంటింటా వెలుగు..!

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత గ్యాస్‌ సిలెండర్ల పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. రేషన్‌ కార్డు కలిగి అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు అందించనున్నారు. దీపావళి నుంచి ఈ పథకాన్ని లబ్ధిదారులకు వర్తింపజేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో 42 ఏజెన్సీల ద్వారా వినియోగదారులకు గ్యాస్‌ సిలెండర్ల పంపిణీ జరుగుతోంది. వాణిజ్య అవసరాలకు తీసుకున్న కనెక్షన్లు మినహా మిగతా ఎల్‌పీజీ కనెక్షన్లదారుల్లో రేషన్‌ కార్డు కలిగిన వారందరికీ ఉచిత సిలెండర్ల పథకం వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img