బిగ్ బాస్ 8 కాంటెస్ట్ మరియు ఢీ డాన్సర్ నైనికా తల్లి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవుతోంది. ఢీ డ్యాన్స్ షో తర్వాత గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ల దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు వచ్చాయని కానీ తనని పంపలేదని నైనికా తల్లి చెప్పింది. జానీ మాస్టర్ దగ్గరకు అయితే వద్దని శశి మాస్టర్ తమతో చెప్పాడని ఆమె అన్నారు. జానీ మాస్టర్ తన అసిస్టెంట్‌ని వేధించాడనే ఆరోపణలతో అతని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. దీంతో నైనికా తల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.