న్యూజిలాండ్‌కు చెందిన యువ మహిళా ఎంపీ హనా రాహితి కరేరికి మైపి క్లార్క్ (22) వినూత్న రీతిలో పార్లమెంట్లో నిరసన తెలిపారు. మావోరి తెగకు చెందిన మైపి క్లార్క్.. ట్రీటీ ప్రిన్సిపిల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో నిరసన చేపట్టారు. వివాదాస్పద ఆ బిల్లును రెండు ముక్కలుగా చించేసి, ఆ తర్వాత మావోరి నృత్యం చేశారు. ఎంపీతో పాటు మరికొందరు సభ్యులు కూడా డ్యాన్స్ చేశారు.