గద్వాల-ఎర్రవల్లిలో మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసునే బురిడీ కొట్టించాడు. ఆ యువకుడు హల్‌చల్ చేస్తున్నాడని ఓ కానిస్టేబుల్ తన వాహనంలో ఎక్కించుకుని వెళ్తుండగా.. హైవేపై ట్రాఫిక్ నిలిపోవడంతో వాహనం పక్కకు ఆపి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇంతలోనే ఆ యువకుడు పోలీస్ వాహనం వేసుకొని పారిపోయాడు. చివరికి దండపురంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని గుర్తించారు.