వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు నేడు రాజ్యసభ ఛైర్మన్ను కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. అనంతరం వీరు టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. “అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదు.. ఇది చారిత్రిక సత్యం” అని ట్వీట్లో పేర్కొన్నారు.