లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు.
జైలులో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా చౌదరీ రాసిన హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు.