Lemon Water : లెమన్ వాటర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ?
Lemon Water : నిమ్మకాయల్లో ఎన్నో అద్భుతమైన ఔషధగుణాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.
రోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే నిమ్మరసాన్ని నేరుగా తీసుకోకుండా గోరు వెచ్చని నీళ్లలో కలిపి తాగవచ్చు.
దీంతో అనేక లాభాలు పొందవచ్చు. అయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. రోజులో అసలు లెమన్ వాటర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు నిమ్మకాయ నీళ్లను తాగడం వలన మనకు అనేక లాభాలు కలుగుతాయి.
నిమ్మకాయ నీళ్లలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి.
నిమ్మకాయ నీళ్లను రోజూ తాగడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది.
నిమ్మకాయ నీళ్లు మన శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. వ్యర్థాలను బయటకు పంపుతాయి.
శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తాయి.
Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా నెలకు రూ.4,950 ఆదాయం
Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు పడకుండా డబ్బు డ్రా చేయడం ఎలా..?
నిమ్మకాయలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి.
ఇవి చర్మాన్ని సంరక్షించడంతోపాటు ముడతలను తొలగిస్తాయి.
దీంతో చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
ఆర్గానిక్ యాసిడ్లు అధికంగా కలిగి ఉన్న వాటిల్లో నిమ్మకాయ నీళ్లు ఒకటి.
ఇవి మెదడులోని కణాలను సంరక్షిస్తాయి. దీంతో మానసిక స్థితి మెరుగుపడుతుంది.
ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
మన శరీరానికి త్వరగా శక్తిని ఇచ్చే వాటిల్లో నిమ్మకాయ నీళ్లు ఒకటి. తల తిరగడం, వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి.
ఇక ఆహార పదార్థాలను త్వరగా జీర్ణించుకునే శక్తి మన శరీరానికి ఉదయం పూట అధికంగా ఉంటుంది.
కనుక లెమన్ వాటర్‌ను ఉదయం తాగితేనే మంచిది. ఎక్కువ శాతం లాభాలను పొందవచ్చు.
Instant Loan : ఇన్స్టంట్ లోన్ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే
Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా
అయితే ఉదయం తాగలేని వారు ఈ నీళ్లను సాయంత్రం తాగవచ్చు. కానీ మధ్యాహ్నం తాగరాదు.
మధ్యాహ్నం నిమ్మకాయ నీళ్లను తాగితే జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది.
ఇక ఉదయం లెమన్‌వాటర్‌ను తాగితే మన శరీరంలోని అవయవాలకు, ఇతర కణాలకు పోషకాలు త్వరగా చేరుతాయి.
నిమ్మకాయ నీళ్లలో విటమిన్ బి1, బి2 అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి.
నిమ్మకాయ నీళ్లలో మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి.
రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల ఈ పోషకాలన్ని మన శరీరానికి త్వరగా అందుతాయి.
కనుక నిమ్మకాయ నీళ్లను ఉదయం తాగితేనే మంచిది.
ఎక్కువ మొత్తంలో పోషకాలు అంది ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
Shopping Tricks : బ్రాండెడ్ షర్టులు తక్కువ ధరకే కావాలా.. ట్రిక్స్
Zinda Tilismath : హైదరాబాదుకు చెందిన జిందా తిలిస్మాత్ చరిత్ర, ఎలా చేస్తారు?