Homeలైఫ్‌స్టైల్‌#Hair #Health #HairLoss : ఎన్ని చేసినా జుట్టు రాలుతుందా..? ఈ చిన్న టిప్ ట్రై...

#Hair #Health #HairLoss : ఎన్ని చేసినా జుట్టు రాలుతుందా..? ఈ చిన్న టిప్ ట్రై చేయండి..

ఆడ, మగ తేడా లేకుండా.. అందరికి ఉన్న సమస్య జుట్టు రాలిపోవడం. శరీర భాగాల్లో అత్యంత సున్నితమైనది జుట్టు.

ఐతే.. జుట్టుని ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవడం అంత తేలిక కాదు.

తలస్నానం చేసినపుడు, సరిగ్గా ఆయిల్ పెట్టనప్పుడు ఊరికే జుట్టు రాలిపోతూ ఉంటుంది.

ఇది నివారించడానికి రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం. కానీ.. ఏవి మన జుట్టుకు సరిపడకపోతే జుట్టు రాలడం మరింత ఎక్కువ అవుతుంది.

ఇక ఈ కెమికల్ షాంపూలు, ఆయిల్స్ వంటివాటిని వాడడం కన్నా స్వచ్ఛమైన కొబ్బరినూనెను వాడడం ఎంతో మేలు.

కొబ్బరినూనె తో పాటు కొంత ఉల్లిపాయ రసాన్ని కలిపి జుట్టు మొదళ్ళలో మర్దనా చేయండి.

ఒక అరగంట తరువాత తలస్నానం చేయాలి.

ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

అలాగే ఉసిరి పొడి-ఆలివ్ ఆయిల్, కర్పూరం-కొబ్బరి నూనె మిశ్రమాలు కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Recent

- Advertisment -spot_img