Homeఫ్లాష్ ఫ్లాష్To send an astronaut on the moon by 2040 2040లోగా Moon...

To send an astronaut on the moon by 2040 2040లోగా Moon పై వ్యోమగామిని పంపాలి

– ఇందుకు ప్లానింగ్ రూపొందించాలి
– సైంటిస్టులను కోరిన ప్రధాని మోడీ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భార‌తీయ వ్యోమ‌గామిని 2040లోగా చంద్రుడి మీద‌కు పంపేందుకు ప్లానింగ్ రూపొందించాల‌ని సైంటిస్టులను ప్ర‌ధాని మోడీ కోరిన‌ట్లు తెలుస్తోంది. 2035లోగా భార‌తీయ స్పేస్ స్టేష‌న్‌ను నిర్మించాల‌ని కూడా ఆయ‌న కోరిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న ద్వారా వెల్ల‌డైంది. గ‌గ‌న్‌యాన్ మిష‌న్ సంసిద్ధ‌త‌పై రివ్యూ మీటింగ్ జ‌రిగిన స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 21వ తేదీన ఉద‌యం 7 గంట‌ల‌కు శ్రీహ‌రికోట నుంచి గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు చెందిన మాడ్యూల్‌ను పరీక్షించ‌నున్నారు. భ‌విష్య‌త్తు అంతరిక్ష కార్య‌క్ర‌మాల గురించి ప్ర‌ధాని మోడీ ఆ స‌మావేశంలో దిశానిర్దేశం చేశారు. వీన‌స్ ఆర్బిటార్ మిష‌న్‌, మార్స్ ల్యాండ‌ర్ గురించి ఆ స‌మావేశంలో చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. 2035లో భార‌తీయ అంత‌రిక్ష స్టేష‌న్ ఏర్పాటు చేయాల‌ని, 2040లోగా చంద్రుడి మీద‌కు భార‌తీయ వ్య‌క్తిని పంపాల‌ని, దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను అంత‌రిక్ష శాఖ డెవ‌ల‌ప్ చేస్తుంద‌ని ప్ర‌ధాని తెలిపారు.

Recent

- Advertisment -spot_img