సత్యభామ’ నిర్మాతలు ఈరోజు సాయంత్రం సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌లో కాజల్ అగర్వాల్‌ను ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ అంటూ పేర్కొన్నారు. ఇది చూసి కాజల్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా మాస్ అనే టైటిల్‌ను తమ పేరు ముందు పెట్టుకోవడానికి చాలా మంది హీరోలు ఇష్టపడతారు. గాడ్ ఆఫ్ మాసెస్, మ్యాన్ ఆఫ్ మాసెస్, మాస్ మహారాజా, మాస్ కా దాస్ అంటూ మన హీరోల్లో చాలా మంది పేర్ల ముందు మాస్ ఉంది. కానీ హీరోయిన్లలో తొలిసారి కాజల్‌కి మాస్ ట్యాగ్ తగిలించారు మేకర్స్. అయితే సడెన్‌గా ఇది చూసి ఇదెప్పుడు పెట్టారు అంటూ నెటిజన్లు కాస్త కొశ్చన్ మార్క్ ఫేస్ పెడుతున్నారు. క్వీన్ ఆఫ్ మాసెస్ ఎలాగమ్మా అంటూ కాజల్‌ని ట్రోల్ చేస్తున్నారు.
ఇక ‘సత్యభామ’ సినిమాను అఖిల్ డేగల డైరెక్ట్ చేస్తున్నారు. ఔరం ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. శశి కిరణ్ తిక్క కథా రచయితగా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుంది కాజల్.