Homeహైదరాబాద్latest Newsవిషాదం.. ఉద్యోగం రాలేదని బెంగతో యువకుడు ఆత్మహత్య.. కన్నీటి సంద్రంలో తల్లిదండ్రులు

విషాదం.. ఉద్యోగం రాలేదని బెంగతో యువకుడు ఆత్మహత్య.. కన్నీటి సంద్రంలో తల్లిదండ్రులు

ఇదే నిజం, లక్షెట్టిపేట: పట్టణంలోని గోదావరి రోడ్డులోని రాంనగర్ కు చెందిన గాధనవేని తిరుపతి (25) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని ఎస్సై సోమవారం తెలిపారు. మృతుడు ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం సెంట్రిగ్ పని చేసుకుంటున్నాడని, తన అన్న ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడన్నారు. మృతుడు రెండుసార్లు ఆర్మీ ఉద్యోగ కోసం దరఖాస్తు చేసుకొని రన్నింగ్ లో క్వాలిఫై కాలేకపోయాడని, దీంతో చాలా బాధపడుతూ దిగులుగా ఉండేవాడన్నారు. ఆన్నకి ఉద్యోగం వచ్చి సెటిల్ అయ్యాడని, తనకి ఉద్యోగం రావడం లేదని ఆదివారం రాత్రి బాధపడితే ఇంట్లో వాళ్ళు ఓదార్చి వెళ్లి పడుకోమని చెప్పారని, అనంతరం గదిలోకి వెల్లి గడియ పెట్టుకొని పడుకున్నాడని, సోమవారం ఉదయం మృతుడు లెవలేదని ఇంట్లో వాళ్లు తలుపు కొడితే తీయక పోవడంతో స్థానికులను పిలిచి తలుపు పగులకొట్టి చూసేసరికి ఉరికి వేలాడుతూ చనిపోయి ఉన్నాడన్నారు. మృతుడి తండ్రి కొమురయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img