ఎండపల్లి, ఇదే నిజం: జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. పురుగుల మందు తాగి ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన కన్నం నవీన్ (25) గత మూడేండ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. జనవరి 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని దగ్గర బంధువు నేరెళ్ల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ ఎస్సై కొక్కుల శ్వేత తెలిపారు.