TS Minister Harish Rao on health facilities in telangana : దేశంలోనే మొదటి సారి.. ఆ ఘనత మనదే..
దేశంలోనే మొదటి సారిగా బస్తి దవాఖాన ప్రారంభించిన ఘనత మనదేనని మంత్రి హరీష్ రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు.
15వ ఆర్ధిక సంఘం హైద్రాబాద్‌లో ప్రారంభమైన బస్తి దవాఖానలను మోడల్‌గా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించిందన్నారు.
హైద్రాబాద్‌లో బస్తి దవాఖానా ప్రారంభమైన తరవాత ఇతర జిల్లాలు నుంచి డిమాండ్ వస్తోందని హరీష్‌రావు పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ”144 బస్తి దవాఖానాలను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు చేస్తున్నాం.
11 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేశాం. రిపోర్ట్స్ నేరుగా మొబైల్‌కి వస్తున్నాయి.
4 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను నిర్మించబోతున్నాం. ఓమిక్రాన్ అని కొత్త వైరస్ వచ్చింది అని ప్రజలు భయపడుతున్నారు.
ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎదర్కొవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
ఒక్కొక్క ఇంటికి వెళ్లి మరీ వాక్సిన్ వేయించాలి. ఓమైక్రాన్ వేరియంట్ ఇంకా మన రాష్ట్రానికి రాలేదు.
బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
ఆమె శాంపిల్‌ను జీనామ్ సీక్వెన్స్‌కి పంపించాం.
రిపోర్ట్ రావడానికి 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది” అని పేర్కొన్నారు.