ఇదేనిజం, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని పటాన్ చెరులో అతివేగంగా దూసుకెళ్లిన స్కూటీ డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులను చందర్(19), నితిన్(18)గా గుర్తించారు. గాయపడ్డ మరో యువకుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.