కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన వెంకటేష్ (20), నందిని (19) ప్రేమించుకుంటున్నారు. వీరి వ్యవహారం కుటుంబసభ్యుల వరకు వెళ్లింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దాంతో విడిచి ఉండలేక, కలిసి బతకలేక చావాలని నిర్ణయించుకున్నారు. తుంగభద్ర రైల్వేస్టేషన్‌లో పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.