బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. షారుఖ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 2న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాను స్ట్రీమింగ్కు పెట్టారు. అయితే, ఓటీటీలో ఈ మూవీ అన్‌కట్ వెర్షన్ స్ట్రీమింగ్ కావడంపై షారుఖ్ సంతోషం వ్యక్తం చేశారు. ముంబయిలోని తన ఇంటి వద్ద ఫ్యాన్స్‌తో ఆయన మాట్లాడారు. ‘జవాన్’ అన్‌కట్ వెర్షన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ నుంచి స్ట్రీమింగ్ వరకు చేసిన ప్రయాణం ఎంతో అసాధారణమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు వారి కుటుంబాలతో కలిసి ‘జవాన్’ను చూసేందుకు ఎదురుచూశారు. వాళ్ల అనుభవాలను తెలుసుకోవడం కోసం నేను ఆసక్తిగా ఉన్నాను. మీకోసం మరిన్ని సాహసాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను’అని షారుఖ్ పేర్కొన్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘జవాన్’ సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,148 కోట్లు వసూళ్లు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.640 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం షారుఖ్ ‘డన్కి’లో నటిస్తున్నారు. రాజ్‌కుమార్ హిరాణీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 22న విడుదల కానుంది.