అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అయితే వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న జో బిడెన్ అధికార పీఠం నుంచి వైదొలగనున్నారు. తాజాగా బిడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోకముందే.. తన హయాంలో అనేక కేసులు ఎదుర్కొంటున్న అధికారులు, మిత్రులు, అనుచరులు కొందరికి క్షమాభిక్ష పెట్టాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టి ఆయనపై ఉన్న పలు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే.ఈ మేరకు సీనియర్ సహాయకులు, వైట్ హౌస్ లాయర్లతో బిడెన్ చర్చలు కథనాలు వచ్చాయి.