భారత్‌పై పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ ప్రశంసలు కురిపించారు. సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ఇరు దేశాలకూ ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందని, కానీ భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగాలని కలలు కంటుంటే.. ఆర్ధిక సంక్షోభంతో మనం అడుక్కు తింటున్నామని ఘాటుగా వ్యాఖ్యానించారు. పాక్ మాత్రం దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నించాల్సి వస్తోందని ఆవేదన చెందారు.