Homeఎడిటోరియల్​North Korea : ఉత్తర కొరియాను సందర్శించి రావడం భారతీయులకు సాధ్యమేనా..?

North Korea : ఉత్తర కొరియాను సందర్శించి రావడం భారతీయులకు సాధ్యమేనా..?

North Korea : ఉత్తర కొరియాను సందర్శించి రావడం భారతీయులకు సాధ్యమేనా..?

North Korea : సాధ్యమే. కానీ కాస్త‌ కష్ట సాధ్యం. భారతీయులకు ఉత్తర కొరియా టూరిస్టు వీసా సులభంగానే దొరుకుతుంది.

ఆ దేశంతో మనకు మంచి సంబంధాలే ఉన్నాయి.

ఐతే ఉత్తర కొరియాలోని అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా మాత్రమే అక్కడ హోటల్ బుకింగ్ వంటివి చేయగలము.

ప్రభుత్వం అనుమతించిన టూరిస్ట్ గైడ్ తోడు లేకుండా మీరు కనీసం హోటల్ దాటి బయటకు వెళ్లలేరు.

హోటళ్లలో వైఫై ఉండదు. రోమింగ్ నెట్వర్కులు పనిచేయవు.

కేవలం వారి రాజధాని ప్యోంగ్ యాంగ్ తప్ప ఇతర నగరాలను సందర్శించడానికి అనుమతి దొరక్కపోవచ్చు.

ప్యోంగ్ యాంగ్ కు కేవలం చైనాలోని బీజింగ్, షాంగ్ హై, డాన్ డోంగ్ వంటి మూడు నాలుగు నగరాలనుండి, రష్యాలోని వ్లాదివోస్తోక్ నుండి మాత్రమే విమానాలు ఉన్నాయి.

Zinda Tilismath : హైదరాబాదుకు చెందిన జిందా తిలిస్మాత్ చరిత్ర, ఎలా చేస్తారు?

Specialty of Kashi : కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు..!

బీజింగ్ నుండి, డాన్ డోంగ్ నుండి రైళ్లు కూడా ఉంటాయి.

కనుక ఉత్తర కొరియా వీసాతో బాటు, చైనా/ రష్యా నుండి ట్రాన్సిట్ వీసా కూడా తెచ్చుకోవలసి ఉంటుంది.

అనుమతి లేకుండా ఎక్కడైనా తిరగడం, ఫోటోలు తీసుకోవడం నిషిద్ధం.

ఉత్తర కొరియా నుండి వచ్చేటప్పుడు కెమెరాలు, మొబైల్ ఫోన్లలోని ప్రతి ఫోటోను తనిఖీ చేస్తారట.

ఏవైనా నిషేధింపబడిన ఫోటోలు ఉంటే వాటిని డిలీట్ చేయడం, కెమెరాను స్వాధీనం చేసుకోవడం, అరెస్టు చేయడం… ఏదైనా జరగవచ్చు.

వీటన్నింటికీ సిద్ధపడితే ఉత్తర కొరియాను సందర్శించడం సాధ్యమే.

పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులతో వారు చాలా ఆదరంగా, మర్యాదగా ప్రవర్తిస్తారు.

MBBS in Abroad : ఫారిన్​లో​ ‘చీప్‌’గా ఎంబీబీఎస్‌ చేస్తారా.. అయితే మీరు బొక్కబోర్లా పడ్డట్టే..

Couple Age Gap : ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..

Recent

- Advertisment -spot_img