Homeలైఫ్‌స్టైల్‌విటమిన్​ టాబ్లెట్లు వేసుకుంటున్నారా...?

విటమిన్​ టాబ్లెట్లు వేసుకుంటున్నారా…?

కరోనా నేపద్యంలో చాలా మంది ప్రజలు విటమిన్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు. 

ఆహారం రూపంలో  కాకుండా ట్యాబెట్ల రూపంలో తీసుకోవడం సరైనదేనా కాదా చాలా మందికి తెలియదు.

ఇక చాలా వార్తల్లో మల్టీవిటమిన్లు ”రోగనిరోధక మద్దతు” ఇస్తాయనో, రోగనిరోధక వ్యవస్థ పనితీరు ఆరోగ్యవంతంగా ఉండేలా చూస్తాయనే చెప్తుంటారు.

అయితే.. ముందుగానే ఆరోగ్యంగా ఉన్నవారిలో విటమిన్ సప్లిమెంట్లు సాధారణంగా పనిచేయవు.

ఉదాహరణకు ‘విటమిన్ సి’ని చూద్దాం.

రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన పరిశోధకుడు లైనస్ పాలింగ్.. సాధారణ జలుబు మీద పోరాటంలో దీని సామర్థ్యం గురించి అబ్బురంగా చెప్పినప్పటి నుంచీ దీనిచుట్టూ అనేక పురాణగాథలు అల్లుకున్నాయి.

ఏళ్ల తరబడి ఈ విటమిన్ మీద అధ్యయనం చేసిన ఆయన.. రోజుకు 18,000 మిల్లీగ్రాములు తీసుకోవటం మొదలుపెట్టారు – ఇది ప్రస్తుతం సిఫారు చేసిన రోజు వారీ మొత్తం కన్నా 300 రెట్లు అధికం.

అయితే.. జలుబు, ఇతర శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్లపై పోరాడి తరిమివేస్తుందనే విటమిన్ సి మహత్తర శక్తిని సమర్థించే ఆధారాలేవీ లేవు.

నిష్పక్షపాత పరిశోధనలకు పేరుగాంచిన కొహ్రేన్ అనే సంస్థ 2013లో చేసిన ఒక సమీక్షలో..

వయోజనుల్లో సాధారణ జలుబు లక్షణాలు మొదలైన తర్వాత వారికి చికిత్సలో భాగంగా అధిక మోతాదుల్లో విటమిన్ సి ఇవ్వటం వల్ల.. సదరు జలుబు కొనసాగే వ్యవధి మీద కానీ, అది కలిగించే లక్షణాల తీవ్రత మీద కానీ ఎటువంటి ప్రభావం చూపలేదు” అని గుర్తించింది.

నిజానికి.. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక జనం తమ ఆహారం ద్వారా తగినంత మోదాదులో విటమిన్ సి పొందుతున్నారని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు.

అంతేకాదు.. విటమిన్ సిని అధిక మొతాదుల్లో తీసుకున్నట్లయితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.

”మీకు విటమిన్ల లోపం లేనట్లయితే.. విటమిన్ సప్లిమెంట్ల వల్ల మీ రోగనిరోధక శక్తికి ఎటువంటి ప్రయోజనం ఉండదు” అంటారు ఇవాసాకి.

ఇక విటమిన్ డి స్థాయి తక్కువగా ఉంటే.. శ్వాస సంబంధిత ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆ ఇన్‌ఫెక్షన్ల వల్ల వచ్చే లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

అసాధారణమైన విషయం ఏమిటంటే.. ఈ విటమిన్ డి లోపం చాలా దేశాల్లో – సంపన్న దేశాల్లో కూడా తీవ్రంగా ఉంది. 2012 అంచనా ప్రకారం ప్రపంచంలో దాదాపు 100 కోట్ల మందికి ఈ విటమిన్ తగినంతగా లభించటం లేదు.

ఇప్పుడు అత్యధిక జనాభా ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి కావటంతో.. శరీరం మీద పడే సూర్యకాంతి మరింతగా తగ్గిపోయి.. విటమిన్ డి లోపం ఇంకా పెరుగుతుందనేది సులభంగా అర్థమవుతుంది.

Recent

- Advertisment -spot_img