Before Death : మనిషి చనిపోవడానికి ముందు ఏమౌతుంది
Before Death : ఈ సృష్టిలోని ప్రతి జీవి.. మనిషితో సహా చనిపోవాల్సిందే.
పుట్టుక ఎంత సహజమో.. చావు కూడా అంతే సహజం. అయితే.. ఏ జీవి పుట్టుక, చావును ఎవ్వరూ డిసైడ్ చేయలేరు.
అందుకే.. మనిషి చావు గురించి ఇప్పటికీ మిస్టరీగా ఉన్న ఎన్నో విషయాలను ఎవ్వరూ నిగ్గు తేల్చలేకపోయారు.
సాంకేతికత అభివృద్ధి చెందినా.. వైద్యరంగంలోనూ ఎన్నో మార్పులు వచ్చినా.. కొన్ని ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతాయి.
అయితే.. ఇటీవల ఓ జర్నల్‌లో ప్రచురితమైన విషయాలను గమనిస్తే అందులో మనిషి చావుకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
న్యూరోసైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం.. మనిషి చనిపోవడానికి ఇంకా 30 సెకండ్ల టైమ్ ఉందనగా.. మనిషికి తన జీవితం మొత్తం ఒకసారి గిర్రున తన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుందట.
Thyroid : ఇవి ట్రై చేస్తే థైరాయిడ్ సమస్య రాదు
Clean Kidneys : కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోండి..
తను పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు చేసిన పనులు, జ్ఞాపకాలు, మనుషులు అందరూ ఒక్కసారి గుర్తుకు వస్తారట.
87 ఏళ్ల ముర్చ వ్యాధి ఉన్న ఓ వృద్ధుడి బ్రెయిన్ వేవ్స్‌ను న్యూరోసైంటిస్టులు అంచనా వేశారు.
ఆ తర్వాత అతడికి సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది.
దీంతో అతడి బ్రెయిన్ వేవ్స్‌లో ఒక్కసారిగా మార్పులను గుర్తించారు.
ఒక్కసారిగా అతడి బ్రెయిన్‌లో ఊహించని యాక్టివిటీ చోటు చేసుకుంది.
ముఖ్యంగా మెదడులో ఉండే మెమోరీ రిట్రీవల్ ఏరియాలో ఊహించని పరిమాణాలు చోటు చేసుకున్నాయి.
అతడు చనిపోవడానికి 30 సెకండ్ల ముందే ఇదంతా చోటు చేసుకోవడంతో సైంటిస్టులు నివ్వెరపోయారు.
అంటే మనిషి చనిపోవడానికి 30 సెకండ్ల ముందు అతడి జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘటనలు..
అవి కూడా మెదడులో స్టోర్ అయి ఉన్నవి ఒక్కసారి అతడి కళ్లముందు కదలాడుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
రీసెర్చ్‌లో పాల్గొన్న డాక్టర్ అజ్మల్ జెమ్మర్ ఏమంటారంటే.. చనిపోవడానికి 30 సెకండ్ల ముందు నుంచే మెదడు రక్తాన్ని గ్రహించడం ఆపేస్తుందట.
Chicken : చికెన్‌ను స్కిన్‌తో తింటే మంచిదా.. కాదా..
WhatsApp new features : వాట్సాప్‌లో ఫొటో ఎడిట్ టూల్
అదే సమయంలో ఆ బ్రెయిన్ వేవ్స్‌ను గమనిస్తే.. అవన్నీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నట్టుగా ప్యాటర్న్ కనిపిస్తుందన్నారు.
మనిషి గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత కూడా 30 సెకండ్ల పాటు ఈ ప్రాసెస్ కొనసాగుతుందట.
మనిషి జీవితంలోనే అది చివరి ప్రక్రియ. ఆ తర్వాత మనిషి ఉండడు.. ఆ జ్ఞాపకాలు ఉండవు.
చివరి క్షణాల్లో మాత్రం తన మెదడులో నిక్షిప్తమైన అన్ని విషయాలు ఒకసారి ఖచ్చితంగా మనిషికి గుర్తుకు వస్తాయని డాక్టర్ అజ్మల్ స్పష్టం చేశారు.
గుండె కొట్టుకోవడం ఆగిపోవడానికి 30 సెకండ్ల ముందు.. గుండె ఆగిపోయిన 30 సెకండ్ల తర్వాత బ్రెయిన్ వేవ్స్‌లో చాలా మార్పులను గమనించవచ్చు.
నాడీ డోలనాలు వాటినే మనం గామా డోలనాలు అని అంటాం.
అవే డెల్టా, తీటా, ఆల్ఫా, బీటా డోలనాలు. వాటిలో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటాయి.. అని అజ్మల్ తెలిపారు.
Google : అమ్మాయిలు గూగుల్ ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారో తెలుసా..