హైదరాబాద్ లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్లాగూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీర్లు తాగుతూ యువతీ యువకుడు హల్చల్ చేశారు. వాకింగ్‌కి వెళ్తున్న వారు నిలదీయడంతో వారితో వాగ్వాదానికి దిగి బూతులు తిట్టారు. చేతిలో బీరు బాటిళ్లు పట్టుకొని కారులో పాటలు పెట్టి నానా హంగామా చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.