కేజీఎఫ్ చాప్టర్1,2 సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో అలరించిన కన్నడ హీరో యష్ తన నెక్ట్స్ సినిమాను అనౌన్స్ చేసేందుకు రెడీ అయ్యారు. కేజీఎఫ్–2 తర్వాత చాలా గ్యాప్ తీసుకునున యష్ తన కెరీర్లో 19వ సినిమాకు సంబంధించి అప్డేట్ను రివీల్ చేశారు. ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయడానికి డేట్ అండ్ టైమ్‌ను ఫిక్స్ చేసుకున్నాడు. లేటెస్ట్ బజ్ ప్రకారం.. యష్ 19 టైటిల్ ఈ నెల 8న ఉదయం 9:55 గంటలకు రివీల్ కానుంది. యష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.