Homeహైదరాబాద్అధిక ఫీజు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

అధిక ఫీజు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ

ఆన్​లైన్​ క్లాసుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ హైదరాబాద్​లోని గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ (cwc) సభ్యులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలంతా ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న తరుణంలో గ్లోబల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి, ఆన్​లైన్​ క్లాసుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను యాజమాన్యం తీవ్రంగా వేధిస్తుందన్నారు. ఫీజుల వేధింపులను నిరసిస్తూ గత మూడు రోజుల నుంచి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నా యాజమాన్యం బేఖాతరు చేస్తూ మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు. ప్రభుత్వం 2020- 21 ఫీజులు పెంచొద్దని చెప్పినా పాఠశాల యాజమాన్యాలు ఫీజులు పెంచి యథేచ్ఛగా లక్షలు వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రైవేట్ పాఠశాలల ఈ ఫీజులుంను విద్యా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏ మాత్రం చర్యలు తీసుకోకపోగా చోద్యం చూస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్​ చేశారు. కేవలం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ, ధనార్జనే ద్యేయంగా బుక్స్, యూనిఫామ్, ఇతరత్రా మౌలిక వసతుల పేరుతో లక్షల ఫీజులు వసూలు చేస్తున్న గ్లోబల్ యజమాన్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ విభాగ్ కన్వినర్ అరవింద్, హృదయ్, అన్వర్, అఖిల్ సింగ్, తేజ, అఖిల్, ఉమేష్, శివ, నిశాంత్, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img