Homeతెలంగాణassembly:అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్

assembly:అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్

సాయన్నకు సంతాపం

  • అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్
  • సాయన్నకు నివాళి అర్పించిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
  • సభ రేపటికి వాయిదా..
  • దివంగత ఎమ్మెల్యే సేవలను కొనియాడిన నేతలు
  • 2 నిమిషాలు మౌనం పాటించిన ఎమ్మెల్యేలు

ఇదేనిజం, స్టేట్ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ ఇటీవల చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్నకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాయన్న సేవలను కొనియాడారు. సాయన్న కంటోన్మెంట్ కోసం ఎంతో క్రుషి చేశారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో కలపాలని సాయన్న ఎంతో ప్రయత్నించారని చెప్పారు. సాయన్న అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నేత అని అన్నారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతిపట్ల సంతాపం తెలుపుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభా వేదికగా పంచుకున్నారు. సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి(శుక్రవారం) వాయిదా పడింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img