హైదరాబాద్: ఉప్పల్‌లో ఉన్న నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 66 పోస్టులను కేవలం ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ 45, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 18, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3 ఖాళీల చొప్పున ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి. 35 నుంచి 50 ఏండ్ల లోపు వయస్సు కలిగినవారై ఉండాలి. ఆసక్తి గలవారు ఆన్‌లైన్లో సెప్టెంబర్ 25 లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్ www.ngri.org.in ను సందర్శించండి.
ఎన్‌జీఆర్ఐలో 66 పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వార భర్తీ
RELATED ARTICLES