Homeతెలంగాణ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై కమిటీ

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై కమిటీ

– మాజీ రాష్ట్రపతి రామ్​ నాథ్​ కోవింద్​ నేతృత్వంలో ఏర్పాటు?
ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై మాజీ రాష్ట్రపతి రామ్​ నాథ్​ కోవింద్​ నేతృత్వంలో ఓ కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జమిలి ఎన్నికల కోసం గత కొంతకాలంగా కసరత్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు సమాచారం. ఇందుకు సంబంధించి పలు జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. సెప్టెంబరులో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు రావడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img