Homeజాతీయంకరోనా పేషెంట్ల​కు గుడ్ న్యూస్

కరోనా పేషెంట్ల​కు గుడ్ న్యూస్

అందుబాటులోకి యాంటి వైరల్ డ్రగ్ ఫివిపరవిర్ కు జెనరిక్ వర్షన్
తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చిన ఫార్మా కంపెనీలు

దేశంలో కరోనా తీవ్రత నానాటికీ ఎక్కువ అవుతుంది. రోజుకి 50 వేలు పైచిలుకు కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్ బారినపడ్డ వారు కొందరు హాస్పిటల్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే.. మరికొందరు హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా ట్రీట్మెంట్ లో భాగంగా వినియోగించే యాంటీవైరల్ డ్రగ్ కరోనా వైరస్ ఉదృతిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో వీటిని ఉత్పత్తి చేసిన ఫార్మా కంపెనీలు వీటికి అధిక ధరలను నిర్ణయించాయి. దాంతో పలు ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్డదారులు తొక్కడం ఆరంభించాయి. మందులు దొరకడం లేదంటూ మార్కెట్ రేట్ కంటే అధిక ధరలకు మందులను విక్రయిస్తూ కరోనా బాధితులను ఆర్థికంగా దోచుకోవడం ప్రారంభించాయి.
తక్కువ ధరకే జనరిక్ వర్షన్
యాంటి వైరల్ డ్రగ్ ఫివిపరవిర్ కు జెనరిక్ వర్షన్ ను కోవిహాల్ట్ పేరుతో ఫార్మా దిగ్గజ కంపెనీ లూపిన్ అందుబాబులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 49 గా ఖరారు చేసింది. మరో ఫార్మా దిగ్గజం కంపెనీ అయినా సన్ ఫార్మా కూడా ఫివిపరవిర్ కు జనరిక్ వర్షన్ ను తీసుకురానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 35గా ఉంటుందని సన్ ఫార్మా వర్గాలు తెలిపాయి.

Recent

- Advertisment -spot_img