ఇదేనిజం, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీ బస్సు ఢీకొని జీహెచ్ఎంసీ కార్మికురాలు దుర్మరణం చెందింది. ఈ ఘటన హైదరాబాద్ రాంకోఠి ప్రాంతంలో చోటు చేసుకున్నది. రాంకోఠి ప్రాంతంలో ఉదయం 7:45 గంటలకు అంబర్‌పేట సర్కిల్ పరిధిలో జీహెచ్‌ఎంసీ స్వీపర్ టీ సునీత రోడ్డు ఊడుస్తున్నారు. ఇంతలో మొయినాబాద్ పరిధిలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజ్ బస్సు వేగంగా వచ్చి ఆమెను వెనక నుంచి ఢీకొట్టింది. రోడ్డు పక్కనే ఓ చెట్టు ఉండగా.. కాలేజు బస్సు, చెట్టు మధ్యలో నలిగి సునీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బస్సు డ్రైవర్ డ్రైవర్ మహ్మద్ గౌస్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు.