ఇంటికి, ఇంటిగేటుకు తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్లవద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లినా సమీప బంధువులను, తెలిసిన మిత్రులను ఇంటి దగ్గర పడుకొనే విధంగా చూసుకోవాలి.
ఒకవేళ తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి కనపడే విధంగా గేట్‌కి, మెయిన్ డోర్‌కి వేయకూడదు. గేట్ బయట నుండి కాకుండా లోపల నుండి, మెయిన్ డోర్ కాకుండా పక్క డోర్లకు తాళం వేసుకోవాలి. తాళం కనపడకుండా డోర్ కర్టెన్‌తో కవర్ చేసే విధంగా చూసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన వస్తువులను.. బంగారు, వెండి ఆభరణాలను, నగదును బీరువాలో పెట్టకూడదు. తప్పనిసరిగా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలి.
రాత్రి సమయంలో ఇంట్లో వెలుతురు ఉండేటట్లు ఏదైనా రూంలో లైట్ వేసి ఉంచాలి.
తప్పనిసరి ఊరికి వెళ్తే.. ఇంటి పక్కన వారికి, సంబంధిత పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించాలి. పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే.. రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ప్రత్యేకంగా నిఘా ఉంచుతారు.
ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి సీసీటీవీ కెమెరాలను ఇంటికి అమర్చుకోవాలి. ఇంటి బయటకు నాలుగు దిక్కులా రోడ్డు కవర్ అయ్యే విధంగా కమ్యూనిటీ, నేను సైతం కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు మీ ఇంటి చుట్టుపక్కల, కాలనీలో తిరుగితే.. వెంటనే డయల్ 100 కి గాని, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు గాని సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ ఈ సూచనలు పాటిస్తూ.. సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.