Homeహైదరాబాద్చిన్నమ్మ వల్లే తెలంగాణ

చిన్నమ్మ వల్లే తెలంగాణ

రాజేంద్రనగర్, ఇదే నిజం ‌: తెలంగాణ రాష్ట్రం సుసాద్వయం కావడంలో తెలంగాణాకు చిన్నమ్మ లాంటి సుష్మా స్వరాజ్​ పాత్ర మరువలేనిదన్నారు బీజేపీ నాయకులు. పార్లమెంటులో తెలంగాణ అంశంపై గొంతెత్తి మాట్లాడిన మొట్టమొదటి మహిళ తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ అని వారు కీర్తించారు. సుష్మా స్వరాజ్​ మొదటి వర్ధంతి వేడుకలు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డివిజన్ నూతన అధ్యక్షుడు చిక్కిరి బిక్షపతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ సేవలను గుర్తుచేశారు. తెలంగాణ రావడానికి సుష్మాస్వరాజే కారణమని ఉద్గాటించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంజన్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుద్దాల లక్ష్మీనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మెండే నాగేష్, మాజీ అధ్యక్షులు గోవిందిగారి శివరాజు, ప్రధాన కార్యదర్శి బాబురావు, ప్రభాకర్, జైపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు పద్మ, అనిల్ ,సతీష్, కిరణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img