Homeఅంతర్జాతీయంచైనాకు మరో దిమ్మతిరిగే షాక్

చైనాకు మరో దిమ్మతిరిగే షాక్

మరో 14 చైనా యాప్ లో పై నిషేధం
త్వరలోనే మరికొన్ని చైనా యాప్​లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్న నిపుణులు
కుయుక్తుల చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది. భారత సార్వభౌమత్వానికి సమగ్రతకి అడ్డంకిగా నిలుస్తున్నాయని మరో 14 చైనా యాప్​లపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకే జూన్ చివరలో 59 చైనా యాప్​లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధాన్ని ఎదుర్కొంటున్న చైనా యాప్​లు నిషేధపు ఆజ్ఞలను పట్టించుకోకుండా కుయుక్తులకు పాల్పడ్డాయి. లైట్, ప్రో పేర్లతో కొత్త యాప్​లను ప్రవేశపెట్టాయి. దీన్ని గమనించిన భారత ప్రభుత్వం ఇలా మోసాలకు పాల్పడుతున్న 49 యాప్​లను గుర్తించి జులై 27న నిషేధం విధించింది. టెక్నికల్​తో సహా వివిధ సమస్యలపై భారత ప్రభుత్వం యాప్ ఓనర్​లను 70 ప్రశ్నలకు సమాధానాలు కోరింది. కొన్ని చైనా కంపెనీలు ఇచ్చిన సమాధానాలు స్పష్టత లేకపోవడంతో వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా మరో 14 చైనా యాప్ లను గుర్తించి నిషేధించింది. ఇందులో ​AirBrush, Meipai, BoXxCAM, Heroes War, SlidePlus, Xiaomi Mi Browser Pro, CapCut, Parallel Space, Baidu Search, Baidu Maps, Weibo, NetEase email service, Search Lite, Baidu Translate యాప్లు ఉన్నాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img