Homeతెలంగాణజంట జలాశయాలకు భారీగా వరద

జంట జలాశయాలకు భారీగా వరద

ఇదే నిజం, హైదరాబాద్ : హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్​కు భారీగా వరద వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్ కు 4 వేల క్యూసెక్కుల వరద రాగా.. అధికారులు 6 గేట్లను ఎత్తారు. మూసీలోకి 4,120 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. హిమాయ‌త్ సాగ‌ర్ ప్రస్తుత నీటి మట్టం1763.50 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ కు ఇన్‌ఫ్లో 2,200 క్యూసెక్కులుగా ఉంది. నీటిమ‌ట్టం 1,789.90 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 1790 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ 6 గేట్లను ఎత్తి మూసీలోకి 2,028 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. మూసీకి వరద పోటెత్తుతుండటంతో పరివాహక ప్రాంతాల జనాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img