Homeజాతీయందీప కాంతుల్లో అయోధ్య...

దీప కాంతుల్లో అయోధ్య…

అయోధ్య నగరం కోట్లాది దీప కాంతులతో కళకళలాడుతుంది. మరో దీపావళిని తలపించేలా అయోధ్య శ్రీరామ పట్టాభిషేకానికి ముస్తాబయ్యింది. అయోధ్యలోని రామ మందిర భూమి పూజ వేడుక చారిత్రాత్మక క్షణం ఇంకా కొన్ని గంటల దూరంలోనే ఉంది. దీంతో పండుగ వాతావరణంలో ఉన్న ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రతీ ఇంటిని దీపాలతో నింపేసారు. దీంతో పవిత్ర నగరం అయోధ్య అంతటా దీపాలతో పాటు లైట్లు వెలిగిపోతున్నాయి.

ఈ రోజు జరిగే ఈ శుభ కార్యక్రమం కోసం స్వాగతం చెబుతూ నగరాన్ని లైట్లు, పూలతో అలంకరించారు సారు నది ఒడ్డున ‘చోటి దీపావళి’ ముందుగానే వచ్చినట్లు కనిపిస్తోంది.

హిందూ ఆచారాలలో ‘నిషన్ పూజ’ అనే పాత సంప్రదాయంలో భాగంగా హనుమంగరి వద్ద హనుమంతుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పూజ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img