– స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కోరుతున్న సర్పంచ్ నవ్య
– బీఆర్ఎస్ నేతలను కలిసేందుకు హైదరాబాద్కు..
ఇదేనిజం, హైదరాబాద్: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కిన జానకీపురం సర్పంచ్ నవ్య.. తాజాగా మరో సారి మీడియా ముందుకొచ్చారు. తాను సైతం స్టేషన్ ఘన్ పూర్ టికెట్ రేసులో ఉన్నానని.. తనకు బీఆర్ఎస్ పెద్దలు ఓ చాన్స్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. నవ్య పలువురు బీఆర్ఎస్ నేతలను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని.. కాబట్టి తనకు అవకాశం ఇవ్వండని నవ్య వేడుకున్నారు.