Homeజాతీయంనెరవేరుతున్న రామమందిర కల

నెరవేరుతున్న రామమందిర కల

రామాలయానికి భూమి పూజ వేడుకల కోసం ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అయోధ్య చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. పూజారి పూజలో భాగంగా సంస్కృత శ్లోకాలు చదువుతుండగా మోడీ ఇతర ప్రముఖులు అందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒకరికొకరు దూరంగా కూర్చుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

లక్షలాదిమందితో అంగరంగవైభవంగా జరగాల్సిన కార్యక్రమం సాదాసీదాగా జరుగుతుంది. 1980 లలో ప్రారంభమైన ఉద్యమంలో భాగమైన మత నాయకులతో సహా అతిథుల జాబితా కరోనా సంక్షోభం దృష్ట్యా 175 కి పరిమితం చేయబడింది.

పూజా కార్యక్రమాలు ముగియడంతో పరిసర ప్రాంతాలు ‘భరత్ మాతా కి జై’, ‘హర్ హర్ మహాదేవ్’ వంటి నినాదాలతో మారుమ్రోగాయి. అనంతరం ప్రధాని ఆలయ నిర్మాణానికి పునాది రాయి వేశారు.

బంతి పువ్వులు, పసుపు, కుంకుమ జెండాలతో అలంకరించబడిన పట్టణం మొత్తం ఈ గొప్ప రామ్ ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవాన్ని జరుపుకున్న సమయంలో భజనలు శ్లోకాలతో పండగ వాతావరణాన్ని అలమరించుకుంది. అయోధ్యకు వెళ్లే రహదారులు ప్రతిపాదిత ఆలయం, శిశు రామ్ రామ్ హోర్డింగ్లతో నిండిపోయాయి. ప్రస్తుతం రామునికి తాత్కాలిక ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని చాలా షాపులు ప్రకాశవంతమైన పసుపు రంగులో పెయింట్ చేయబడ్డాయి.

ప్రధానమంత్రి హెలికాప్టర్‌లో అయోధ్యకు చేరుకున్నారు, అక్కడ ఆదిత్యనాథ్, ఇతరులు ఆయనను స్వాగతించారు. ‘శ్రీ రామ్ జన్మభూమి మందిరం’ పునాది రాయి వేసే కార్యక్రమానికి ముందు ప్రధాని హనుమన్‌ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు.

అక్కడి నుంచి ‘శ్రీ రామ్ జన్మభూమి’కి వెళ్లి అక్కడ’ భగవాన్ శ్రీ రామ్‌లాలా విరాజ్మన్ ‘వద్ద ప్రార్థనలు చేశారు. అక్కడ ప్రధాని పారిజాత్ మొక్కను కూడా నాటాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img