Homeతెలంగాణపాడె మోసిన మంత్రి హరీష్​ రావు..

పాడె మోసిన మంత్రి హరీష్​ రావు..

దుబ్బాక ఎమ్మెల్యే సోలీపేట రామలింగా రెడ్డిపై మంత్రి హరీష్​ రావు తనకున్న ఆత్మీయతను చాటుకున్నారు. విద్యార్థి దశ నుండే ఉద్యామాల చిరునామాగా, ఒక మంచి జర్నలిస్టుగా గారిబోళ్ల నాయకుడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి. రామలింగారెడ్డికి, మంత్రి హరీష్​ రావుకు మద్య ఎంతో కాలంగా మంచి స్నేహం ఉంది. మంత్రి హరీష్​ రావు రామలింగా రెడ్డిని తన ఇంట్లో మనిషిగానే చూస్తారు. కానీ రామలింగారెడ్డి అకాల మరణం హరీష్​​ రావుకు మంచి స్నేహితున్ని దూరం చేసింది. దీంతో హరీష్​ రావుతో పాటు దుబ్బాక ప్రజలూ తీరని లోటుగా భావిస్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన రామలింగారెడ్డి అంతిమ సంస్కరణలలో మంత్రి హరీష్​ రావు పాల్గొనడమే కాకుండా అంతిమ శవ యాత్రలో పాడె మోసి తన ఆప్యాయతను చాటుకున్నారు. ఈ అంతిమ యాత్రలో మెదక్​ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img