Homeతెలంగాణపార్టీ మారడం లేదు– బీజేపీ నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తా– ఎమ్మెల్యే రఘునందన్​ రావు

పార్టీ మారడం లేదు– బీజేపీ నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తా– ఎమ్మెల్యే రఘునందన్​ రావు

ఇదేనిజం, హైదరాబాద్​: తాను పార్టీ మారడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు క్లారిటీ ఇచ్చారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం హైదరాబాద్​ లో ఎమ్మెల్యే రఘునందర్​ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతోన్న మాట అవాస్తవమన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీకి వస్తానన్నారు. పార్టీ ఆదేశిస్తే.. సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీ చేయటానికి సిద్ధమని రఘునందనరావు తెలిపారు. గజ్వేల్ ఈటల, సిరిసిల్లలో బండి సంజయ్, కామారెడ్డిలో ధర్మపురి అర్వింద్‌లు బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నారన్నారు.

Recent

- Advertisment -spot_img