Homeక్రైంబాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్యలో మరో మలుపు

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్యలో మరో మలుపు

సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
మహారాష్ట్ర పోలీసుల తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు
మూడు రోజుల్లో స్టేటస్ రిపోర్ట్ తెలియజేయాలని ఆదేశం
ఎట్టకేలకు పలించిన బీహార్ ప్రభుత్వ యత్నం


బాలీవుడ్ యువ కెరటం సంచలన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆయన ఆత్మహత్య తీరుపై సందేహాలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తు తీరు, గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి స్పందించిన తీరుపై అనేక సందేహాలను నెటిజన్లు సోషల్ మీడియాలో తూర్పార పడుతున్నారు. సుశాంత్ సుశాంత్ ఆత్మహత్యపై ఆయన కుటుంబ సభ్యులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీహార్ ప్రభుత్వం సుశాంత్ ఆత్మహత్య సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సైతం శాంతి ఆత్మహత్యపై పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తనపై దర్యాప్తును బిహార్ లోని పాట్నా నుంచి ముంబై కి మార్చాలంటూ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు సందేహాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సుశాంత్ మరణం వెనుక ఉన్న రహస్యాలను ఛేదించాలని అవసరం ఉంది అన్నట్టు వ్యాఖ్యానించినట్టు సమాచారం. మరోవైపు మహారాష్ట్ర పోలీసుల తీరును సుప్రీంకోర్టు ఎండగట్టింది. విచారణ సందర్భంగా ముంబై వచ్చిన ఐపీఎస్ అధికారిని గృహనిర్బంధం చేయడం పట్ల ఆక్షేపించింది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు పై మూడు రోజుల్లోగా స్టేటస్ రిపోర్ట్ ని అందజేయాలని మహారాష్ట్ర పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశించింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img