Homeతెలంగాణమంత్రి గంగుల కుటుంబసభ్యులకు ఈడీ నోటీసులు

మంత్రి గంగుల కుటుంబసభ్యులకు ఈడీ నోటీసులు

– ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన శ్వేతా గ్రానైట్స్ ?

ఇదేనిజం, కరీంనగర్​: మంత్రి గంగుల కమలాకర్​ కుటుంబసభ్యులకు మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగుల కుటుంబసభ్యులకు చెందిన శ్వేతా గ్రానైట్స్​ కంపెనీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గ్రానైట్స్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా ఫెమా నిబంధనలో రూ. 4.8 కోట్ల ఫ్రాడ్‌కి శ్వేత ఏజెన్సీస్ పాల్పడినట్టు సమాచారం. చైనాకు గ్రానైట్ మెటీరియల్ ఎక్స్‌పోర్ట్ చేయటంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో కేవలం శ్వేతా ఏజెన్సీస్ రూ.3 కోట్లు చెల్లించింది. ఇంకా సుమారు 50 కోట్ల వరకూ పెండింగ్ ఉంది. హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్టు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నట్టు సమాచారం. గత ఏడాది నవంబర్‌లో శ్వేతా ఏజెన్సీస్‌పై ఈడీ సోదాలు నిర్వహించింది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img