గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు
జలమయమైన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు
నేను కూలిన పురాతన భవనాలు వృక్షాలు, వృక్షాలు
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతుంది. గడిచిన 24 గంటల్లో 200 మిల్లీలీటర్ల భారీ వర్షపాతం చోటు చేసుకోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దముంబై రెడ్ అలెర్ట్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ వరదల కారణంగా ఒకరు మరణించగా 10 వరకు భవనాలు కూలినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ముంబై ప్రధాన వీధుల్లో వాహనాలు నీళ్ళలో తేలుతూ కనిపిస్తున్నాయి. ఇప్పటికే పురాతన భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇండ్లల్లో గడుపుతున్నారు.