Homeతెలంగాణమోకరిల్లడమే కాంగ్రెస్​ నైజం

మోకరిల్లడమే కాంగ్రెస్​ నైజం

మోకరిల్లడమే కాంగ్రెస్​ నైజం
– అప్పుడు ఢిల్లీలో ఇప్పుడు బెంగళూరులో..
– బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత..

ఇదేనిజం, హైదరాబాద్​: కాంగ్రెస్​ పార్టీపై బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ షర్మిల ఫైర్​ అయ్యారు. మోకరిల్లడమే కాంగ్రెస్​ నైజమని విమర్శించారు. ఇటీవల పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ తో భేటీ అయ్యారు. కాగా ఈ భేటీపై కవిత స్పందించారు. తెలంగాణ ప్రజ‌ల‌ను నిలువునా మోసం చేస్తున్న హ‌స్తం పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా మారిన కాంగ్రెస్ నాయ‌కుల‌పై విరుచుకుప‌డ్డారు. అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వ‌యా బెంగ‌ళూరు అంటూ క‌విత త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. బెంగ‌ళూరు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాలు చేస్తుంద‌ని పేర్కొంటూ డీకే శివ‌కుమార్, రేవంత్ రెడ్డి క‌లిసి ఉన్న ఫోటోను క‌విత షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టుపెట్ట‌డం అని ధ్వ‌జ‌మెత్తారు. ఢిల్లీ, గ‌ల్లీల‌లో మోక‌రిల్ల‌డం కాంగ్రెస్ పార్టీ నైజం అంటూ ఆమె నిప్పులు చెరిగారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img